కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ఎన్జీవో కాలనీలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల బాలికల పాఠశాలలో అదనపు తరగతి గదులను జడ్పీ ఛైర్ పర్సన్ లక్ష్మి, వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు ప్రారంభించారు. రూ.25 లక్షల డీఎంఎఫ్ నిధులతో నాలుగు గదులను నిర్మించినట్లు పాఠశాల అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తోందని జడ్పీ ఛైర్ పర్సన్ అన్నారు.
ఇవీ చూడండి: అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్ ఎక్కడిది?