కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యవసర పరిస్థితుల్లో వైద్యుడు అందుబాటులో లేకపోవటం వల్ల ఓ యువకుడి ప్రాణం గాల్లో కలిసి పోయింది. వాంకిడి మండలం అర్జునిగూడకు చెందిన రోహిదాస్ అనే యువకుడికి వాంతులు, విరోచనాలతో కూడిన జ్వరం వచ్చింది. స్థానికంగా ఉన్న వాంకిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ దాదాపుగా గంట వరకు వైద్యులు అందుబాటులోకి రాలేదు. ఆ తరువాత ప్రభుత్వ వైద్యురాలు వచ్చిచూడగా అప్పటికే ఆ యువకుడు మృతి చెందాడు. దాంతో ఆగ్రహానికి లోనైన మృతుడి బందువులు పీహెచ్‌సీ ఎదుట ఆందోళకు దిగడం... స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. కాగా రోహిదాస్‌ను మృతి చెందిన తర్వాతే ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారని వైద్యసిబ్బంది పేర్కొనడం విమర్శలకు దారితీసింది.
ఇవీ చూడండి: జపాన్ కోడలి కోసం అత్త ఇంగ్లీషు ట్యూషన్