కుమురం భీం జిల్లా కాగజ్ నగర్లో ఓ యువతి మౌన పోరాటం చేస్తోంది. పట్టణానికి చెందిన ఈ యువతి నౌగం బస్తీకి చెందిన జూపాక రఘు అనే యువకుడి ఇంటి ముందు బైటాయించింది. రఘు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపించింది.
తనను పెళ్లి చేసుకోవడం రఘుకు ఇష్టం ఉన్నా.. కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడని ఆమె తెలిపింది. తనకు న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తానని యువతి స్పష్టం చేసింది.
ఇవీ చూడండి: ఘోర అగ్నిప్రమాదం... నాలుగు దుకాణాలు దగ్ధం