ETV Bharat / state

బెజ్జూరులో స్వచ్ఛంద లాక్​డౌన్

కరోనా మహమ్మరిని నియంత్రించేందుకు గ్రామాలు నడుం బిగించాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండడం వల్ల స్వచ్ఛంద లాక్​డౌన్ విధించుకుంటున్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో స్వచ్ఛంద లాక్​డౌన్ అమలుచేయాలని గ్రామపంచాయతీ నిర్ణయించింది.

bejjuru voluntary lock down ,  bejjuru village lock down
బెజ్జూరులో స్వచ్ఛంద లాక్​డౌన్, గ్రామాల్లో లాక్​డౌన్
author img

By

Published : May 9, 2021, 6:07 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జురు మండలకేంద్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్వచ్ఛంద లాక్​డౌన్​ విధిస్తున్నట్లు గ్రామ పంచాయతీ సభ్యులు తీర్మానం చేశారు. ఈనెల 14 నుంచి 23 వరకు లాక్​డౌన్ అమలుచేయాలని నిర్ణయించారు. అత్యవసర సేవలు మినహా అన్ని దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5000 జరిమానా విధించాలని తీర్మానించారు. ఈ నిర్ణయానికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన దక్కింది. ఈ సమావేశంలో బెజ్జురు సర్పంచ్ అన్సార్ హుస్సేన్, ఎస్సై సాగర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కరోనా కట్టడి, ఔషధాలు, వ్యాక్సినేషన్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.