ETV Bharat / state

'ఓటు హక్కు' ఇక్కడా ఉంది... అక్కడా ఉంది!

అవి తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు మండలంలోని పంచాయతీలు. ఆ ఊర్లలో వారికి రెండు రాష్ట్రాల్లో ఓటుహక్కు ఉంది. పార్లమెంటు ఎన్నికలు ఒకే దఫా జరుగుతున్నందున వారు ఎక్కడ ఓటేస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఒకే చోట వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. మరి వారు ఏం చేస్తారో చూడాలి.

రెండు రాష్ట్రాల్లో ఓటుంది వీరికి
author img

By

Published : Apr 9, 2019, 6:59 PM IST

Updated : Apr 10, 2019, 12:25 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండలం తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. పారందోలి, ముకుద్దం గూడ, బోలపటార్, అనంతపూర్​ గ్రామాలు తెలంగాణలోని ఆదిలాబాద్, మహారాష్ట్రలోని చంద్రాపూర్ లోక్​సభ స్థానాల్లో ఉన్నాయి. ఈ పంచాయతీల పరిధిలో 7021మంది ఓటర్లు ఉన్నారు. వీరు తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్నారు. అంతే కాకుండా రెండు రాష్ట్రాల్లోనూ ఓటుహక్కు ఉంది. ఈనెల11న రెండుచోట్ల లోక్​సభ ఎన్నికలు ఒకేసారి జరుగనున్నాయి. సాధారణంగా వీరు రెండు చోట్ల ఓటేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎన్నికల సంఘం సూచన మేరకు ఎక్కడైనా ఒకేచోట ఓటుహక్కు వినియోగించుకోవాలని తహసీల్దార్ అవగాహన కల్పించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వీరు మాత్రం ఓటేశాక సిరా గుర్తు చెరిపేసి లేదా మహారాష్ట్ర ఎన్నికల అధికారులను ఒప్పించి రెండు ఓట్లు వేస్తారు. రెండు రాష్ట్రాల అధికారులు ఇక్కడ పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

రెండు రాష్ట్రాల్లో ఓటుంది వీరికి

ఇవీ చూడండి: మనవెన్ని..వాళ్లవెన్ని.. కూడికలు, తీసివేతల్లో పార్టీలు

sample description
Last Updated : Apr 10, 2019, 12:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.