ETV Bharat / state

'గ్రామంలో రహదారి సమస్యను పరిష్కరించండి సారూ' - కుమురంభీం జిల్లా వార్తలు

కుమురం భీం జిల్లా బొంబాయిగూడాలో రహదారి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

villagers requesting officials to Solve road problem in the village
'గ్రామంలో రహదారి సమస్యను పరిష్కరించండి సారూ'
author img

By

Published : Aug 27, 2020, 12:53 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా పెంచికలపేట మండలం బొంబాయిగూడాలో రహదారి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా.. పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో పంచాయతీ కార్యాలయానికి, పాఠశాలకు వెళ్లడానికి మార్గం కోసం గ్రామస్థులంతా కలిసి స్థలాన్ని కేటాయించారు. ఇందుకు గ్రామంలోని ఒక కుటుంబం ఒప్పుకోకపోవడం వల్ల రహదారి పనులు నిలిచిపోయాయి. ఫలితంగా గ్రామస్థులు సమస్యను పరిష్కరించాలని కలెక్టర్​ను ఆశ్రయించగా.. పాలనాధికారి మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ సమస్య పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి.. గ్రామంలో రహదారి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ఇదీచూడండి..వచ్చే నెల 7 నుంచి సభా 'సమరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.