కుమురం భీం జిల్లా కాగజ్నగర్ వాంకిడి మండలానికి చెందిన పార్వతబాయికి పురిటి నొప్పులు రావడం వల్ల భర్త సమీర్.. కుటుంబసభ్యులతో కలిసి కాగజ్నగర్ ఆసుపత్రిలో చూపించడానికి వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలోకి వచ్చేసరికి పార్వతబాయి మగబిడ్డను ప్రసవించింది. తల్లిబిడ్డలను కాగజ్నగర్ ప్రభుత్వాసుపత్రిలో చూపెడుదామని తీసుకురాగా.. వాహనం ఆసుపత్రిలోనికి వచ్చేదారిలో బురదలో కూరుకుపోయింది.
ఎంత ప్రయత్నించినప్పటికీ వాహనం బయటకు రాలేదు. బాలింతకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో... భర్త సమీర్ ఆసుపత్రి సిబ్బందితో కలిసి పార్వతబాయిని స్ట్రైచర్పై ఆస్పత్రిలోకి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగానే ఉన్నప్పటికీ ఆసుపత్రికి రహదారి సౌకర్యం లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి కల్వర్టు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: గాలి ద్వారా కరోనా.. అడ్డుకోవడం ఎలా?