ETV Bharat / state

ఆకాశమే హద్దుగా పెరిగిన కూరగాయల ధరలు

author img

By

Published : Mar 23, 2020, 3:42 PM IST

జనతా కర్ఫ్యూ మూలంగా కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో కూరగాయల ధరలు కొండెక్కాయి. కరోనా వైరస్​ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్​ను​ ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఆమాంతం ధరలు పెంచేశారు.

Vegitable Rates
Vegitable Rates

కరోనా వైరస్ ప్రభావం రోజువారీ సరుకులు, కూరగాయల పైన పడింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూరగాయల రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. జనతా కర్ఫ్యూతో మూసివేసిన వ్యాపార, వాణిజ్య సంస్థలు, కూరగాయల మార్కెట్లలో కొన్నింటిని సోమవారం తెరవగా... మార్కెట్​లోకి పెద్దఎత్తున ప్రజలు వచ్చారు. ఇదే అదనుగా భావించిన కూరగాయల వ్యాపారులు ఆకాశమే హద్దుగా ధరలను పెంచేశారు.

పెరిగిన ధరల పట్ల సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి అధికధరకు సరుకులు అమ్మితే కేసులు నమోదు చేస్తామని వ్యాపారస్తులను హెచ్చరించారు. మార్కెట్లో ప్రజలను గుంపులుగుంపులుగా ఉండకుండా పోలీసులు నిర్బంధం చేస్తూ కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రెండో రోజు సైతం జిల్లాలో కర్ఫ్యూ కొనసాగుతోంది.

ఆకాశమే హద్దుగా పెరిగిన కూరగాయల ధరలు

ఇవీ చూడండి: 27కు చేరిన కరోనా కేసులు.. కట్టడికి కఠిన నిర్ణయాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.