ETV Bharat / state

ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి : ఫరూక్​ హుస్సేన్​

ప్రజాప్రతినిధులు కూడా కార్యకర్తలతోనే సమానమని తెరాస ఎమ్మెల్సీ ఫరూక్​ హుస్సేన్​ అన్నారు. సిద్దిపేట కన్నా అత్యధికంగా పార్టీ సభ్యత్వాలు నమోదు చేయాలని సూచించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​లో ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Trs membership registration started in kagaznagar in kumuram bheem asifabad district today
సభ్యత్వాన్ని అందజేస్తున్న ఎమ్మెల్సీ ఫరూక్​, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
author img

By

Published : Feb 13, 2021, 10:41 PM IST

పార్టీ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని తెరాస ఎమ్మెల్సీ ఫరూక్​ హుస్సేన్​ పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ప్రజాప్రతినిధులు మాజీలైనా కూడా కార్యకర్తలు మాత్రం అలాగే ఉంటారని తెలిపారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

కార్యకర్తలకు ఏ పార్టీలో లభించని ప్రాధాన్యత తెరాసలో లభిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గొప్ప నాయకుడని అన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు రాష్ట్రంలో అమలవుతాయని పేర్కొన్నారు. బంగారు పాలన తెరాసతోనే సాధ్యమన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో పాటు పలువురికి సభ్యత్వ నమోదు రసీదు అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​, జిల్లా పరిషత్​ ఉపాధ్యక్షుడు కోనేరు కృష్ణారావు, పురపాలక ఛైర్మన్ సద్దాం హుస్సేన్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : సభ్యత్వ నమోదులోనూ సిద్దిపేట ముందుండాలి: హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.