కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో భాజపా నేతలు, మైనార్టీ మహిళలు సంబురాలు చేసుకున్నారు. ముమ్మారు తలాక్ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రధాని తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని, కులమతాలకు అతీతంగా భారతీయ మహిళలందరికీ ప్రాధాన్యం కల్పించే నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని భాజపా మహిళా నాయకురాలు కొత్తపల్లి అనిత తెలిపారు.
ఇదీ చదవండిః కల్వకుర్తి సబ్జైలర్పై సస్పెన్షన్ వేటు