ETV Bharat / state

'ఉత్తమ సేవలందించారు... బదిలీ నిలిపివేయండి' - komaram bheem district latest news

కుమురం భీం ఆసిఫాబాద్ కలెక్టర్​ సందీప్ కుమార్ ఝా బదిలీని నిలిపివేయాలని కోరుతూ తిర్యాని మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. జిల్లాలో ఆయన ఉత్తమ సేవలు అందించారని... బదిలీని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

tribal association protest against collector transfer at tiryani mandal
'ఉత్తమ సేవలందించారు... బదిలీ నిలిపివేయండి'
author img

By

Published : Nov 11, 2020, 8:25 AM IST

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎన్నో ఉత్తమ సేవలు అందించారని ఆదివాసీ సంఘాల నాయకులు తెలిపారు. ముఖ్యంగా ఆదివాసీల సమస్యలు గుర్తించి, త్వరితగతిన పరిష్కరించి జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ కలెక్టర్​గా విధులు నిర్వర్తించిన సందీప్ కుమార్ ఝా బదిలీకి నిరసనగా తిర్యాని కుమురం భీం చౌరస్తాలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తిర్యాణి తహసీల్దార్ మష్కురు అలీకి వినతి పత్రాన్ని సమర్పించారు.

కొంతమంది నాయకులకు ఆయనంటే గిట్టకనే తొమ్మిది నెలల వ్యవధిలోనే బదిలీ చేయించారని వారు ఆరోపించారు. వెంటనే ఆయన బదిలీని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తుడుందెబ్బ అధ్యక్షులు వేడ్మ భగవంతరావు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఆదివాసీలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: జాతి కోళ్లు బరువులోనే కాదు ధరలోనూ అదిరిపోతుంది

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.