ETV Bharat / state

ఆధునిక సమాజంలో.. పాశవిక మనుషులు - ఆదివాసీల

ఆధునిక సమాజానికి దూరంగా ఎక్కడో అడవుల్లో నివసించేవారు ఆదివాసీలు. వారి పేదరికం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు పాశవిక చర్యకు ఒడిగట్టారు. ఓ ఆదివాసీ యువతిని వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తికి విక్రయించారు. చట్టాన్ని కాపాడాల్సిన ఓ పోలీసు అధికారి... దళారులతో చేతులు కలిపాడు. మానవత్వం మంటలో కలపడానికి తన వంతు పాత్ర సమర్థంగా పోషించాడు. ఆదివాసీ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆధునిక సమాజంలో.. పాశవిక మనుషులు
author img

By

Published : Aug 13, 2019, 5:36 PM IST

ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా... చేసుకుని కాసుల కక్కుర్తితో దళారులు ఓ యువతిని వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తికి విక్రయించిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది. తిర్యాణి మండలానికి చెందిన ఓ యువతికి మాయమాటలు చెప్పి, ఉద్యోగం కల్పిస్తామని కొంత మంది దళారులు రాజస్థాన్‌కు తీసుకెళ్లారు. కాసుల కక్కుర్తితో అక్కడ ఓ వ్యక్తికి విక్రయించారు. కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించగా... విచారణ ప్రారంభించారు. ఈ వ్యవహారంలో ఓ కానిస్టేబుల్ ప్రమేయం కూడా ఉందని తెలుసుకొని అంతా నివ్వెరపోయారు. అమ్మాయిని రాష్ట్రానికి తీసుకురావడానికి రాజస్థాన్‌కు వెళ్లిన ప్రత్యేక బృందం ఆ యువతిని క్షేమంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించింది.

పేదరికమే ఆసరాగా..

జిల్లా కేంద్రంలో మద్యం గొలుసు దుకాణం నిర్వహించే ఓ మహిళ, పాత్రికేయుడిగా చెప్పుకొని తిరుగుతున్న ఓ వ్యక్తి కలిసి అమ్మాయిల అక్రమ రవాణా చేసే దళారులుగా మారారు. తిర్యాణి మండలానికి చెందిన నిరుపేద యువతిపై వల విసిరారు. రాజస్థాన్​లో మంచి పని ఉంటుంది.. రూ.10 వేల వరకు వేతనం లభిస్తుందని యువతి తల్లిదండ్రులకు చెప్పారు. వారు నమ్మి దళారులతో అమ్మాయిని సాగనంపారు. వీరు రాజస్థాన్‌కు తీసుకెళ్లి అక్కడ ఓ వ్యక్తికి విక్రయించారు. అక్కడ చిత్రహింసలను తట్టుకోలేక ఆ అమ్మాయి ఎలాగోలా తల్లిదండ్రులకు సమాచారం అందించింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసు ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి యువతి క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఇద్దరు దళారులతో పాటు, వారికి వంత పాడిన ఓ పోలీసును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గతంలోనూ...

గిరిజన జిల్లాలో ఆడపిల్లల విక్రయాలు తరచూ జరుగుతున్నాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. కొన్ని ఘటనలు మాత్రమే వెలుగులోకి వస్తుండగా... బయటకు రానివి ఎన్నో ఉంటున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని బెజ్జూర్‌, తిర్యాణి, కెరమెరి, వాంకిడి, జైనూర్‌, కౌటాల, సిర్పూర్‌(యు) మండలాల నుంచి ఎక్కువగా అమ్మాయిల అక్రమ రవాణా కేసులు నమోదవుతున్నాయి.

పెళ్లి పేరుతో విక్రయాలు..

2016లో కెరమెరి మండలంలోని నాయకపుగూడ గ్రామానికి చెందిన ఓ మహిళను దళారులు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తికి పెళ్లి పేరుతో విక్రయించారు. ఇదే మండలం నాగల్‌గొందికి చెందిన మరో మహిళను సైతం ఇదే తరహాలో గుంటూరుకు అక్రమ రవాణా చేయగా పోలీసులు అమ్మాయిని రక్షించారు. 2017లో నార్నూర్‌ మండలంలోని కైరుదాటువా, ఉట్నూర్‌ మండలంలోని సాలేవాడ నుంచి అమ్మాయిలను, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు పెళ్లి పేరుతోనే విక్రయించారు.

ఏమైపోతున్నాయి... పథకాలు

గిరిజన సంక్షేమ పథకాలు ఎలా వట్టిపోతున్నాయో అడపిల్లల అమ్మకాలు తేటతెల్లం చేస్తున్నాయి. బాల్యం నుంచి బతుకుపోరాటం చేస్తున్న ఆదివాసీలకు కల్యాణయోగం కలగానే మారుతోంది. సరిగ్గా ఈ సమయంలోనే రంగప్రవేశం చేసే కొందరు యువతుల తల్లిదండ్రులను మాటలతో మాయ చేస్తున్నారు. మీ కూతురికి ఉన్నత భవిష్యత్తుతో పాటు, మంచి భర్త లభిస్తారని నమ్మిస్తున్నారు. ఎన్నో ఆశలతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిన గిరిజన యువతులు అక్కడికి వెళ్లగానే ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. రాజస్థాన్‌ వెళ్లిన యువతుల వేదన వర్ణనాతీతంగా ఉంటోంది. నానా చాకిరీ చేయించుకుని గిరిజన మహిళలను శారీరకంగా, మానసికంగా కుంగదీస్తుంటారు.

ఉచ్చులో పడకండి...

ఆదివాసీ యువతులు ఇలాంటి మాయగాళ్ల ఉచ్చులో పడకూడదని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఆదివాసీ మహిళలకు ఉపాధి కల్పన, ప్రత్యేక రక్షణ కల్పించాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు. ఆదివాసీలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలను తీవ్రమైన చర్యగా భావించి నిందితులకు కఠిన శిక్షలు విధించాలని సూచిస్తున్నారు.

ఆధునిక సమాజంలో.. పాశవిక మనుషులు

ఇవీచూడండి: పంద్రాగస్టు కోసం గోల్కొండలో ముమ్మరంగా ఏర్పాట్లు

Intro:TG_ADB_11_12_BAKRID_AV_TS10032

Body:బక్రీద్ పండుగను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా లో ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు తమ పూర్వీకులకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత గురువు ముస్లింల ఆచార వ్యవహారాల గురించి ప్రార్థనల్లో తెలియజేశారు అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు ముస్లిం సోదరులను ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సంప్రదాయం లో ఉన్నతస్థాయిలో ఉన్నవారు పేదవారిని చేయూతనిచ్చి ఆదరిస్తారని కొనియాడారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మసీదుల లోని ఇమామ్లకు గౌరవ వేతనం అందిస్తుందని మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు.

బైట్ నడిపల్లి దివాకర్ రావు, ఎమ్మెల్యే మంచిర్యాల

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.