ఉమ్మడి ఆదిలాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాల్లో జనావాసాల్లోకి పులుల రావడంపై ఎంపీ సోయం బాపూరావు ఆందోళన వ్యక్తం చేశారు. పులి దాడిలో ఇప్పటికే ఇద్దరు మరణించగా.. చాలా పశువులు మరణించాయన్నారు. ప్రజలూ పులి సంచారంపై భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు.
జనావాసాల్లోకి పులులు రావడం కుట్రగా అభివర్ణించిన సోయం.. అడవి నుంచి ఆదివాసీలను దూరం చేసేందుకు పులులను వదిలారని ఆరోపించారు. మనుషుల కంటే పులుల ప్రాణాలకే ఎక్కువ విలువిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అటవీ అధికారులకు పులులను పట్టుకోవడం పెద్దసమస్య కాదని.. కావాలనే పట్టించుకోవడం లేదని బాపూరావు ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని.. ఆదివాసీలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: ఆగని పెద్దపులి వేట.. బెంబేలెత్తిస్తున్న వరుస దాడులు
కాగజ్‌నగర్ కారిడార్‌లో 2 పులి పిల్లలు