ETV Bharat / state

వామ్మో పెద్దపులి... భయాందోళనలో ప్రజలు - Tiger wandering people in panic news

బెజ్జూరు- పెంచికల్‌పేట్‌ ప్రధాన రహదారి, అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుండటంతో వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పులిని పట్టుకునే పనిలో అటవీ అధికారులు నిమగ్నమయ్యారు.

వామ్మో పెద్దపులి... భయాందోళనలో ప్రజలు
వామ్మో పెద్దపులి... భయాందోళనలో ప్రజలు
author img

By

Published : Oct 4, 2020, 9:34 AM IST

కుమురం భీం జిల్లా బెజ్జూరు- పెంచికల్‌పేట్‌ ప్రధాన రహదారి, అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుండటంతో వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పెంచికల్‌పేట్‌ మండలంలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన గుర్రాల సత్యనారాయణ, అల్లె బానేష్‌, ఉప్పరి చింటు, లోడ్‌పల్లికి చెందిన చింతల సాగర్‌లు శనివారం బెజ్జూరులో తాపి మేస్త్రి పని ముగించుకొని ఎల్కపల్లికి వెళ్తున్న క్రమంలో.. సులుగుపల్లి గొల్లదేవార సమీపంలో శనివారం రాత్రి 7.15గంటల సమయంలో పెద్దపులి ఎదురైంది.

సత్యనారాయణ ద్విచక్రవాహనం వెనుక కొద్దిదూరం పాటు పులి వెంబడించింది. దీంతో వారు ఆందోళన చెందారు. వాహన వేగం పెంచారు. అదే సమయంలో బారేగూడ గ్రామ పశువైద్య సేవకుడు పల్లెం రవికి సైతం పులి ఎదురైంది. వారంలో మూడు, నాలుగుసార్లు అదే ప్రాంతంలో పులి కనబడినట్లు బాటసారులు తెలిపారు. దీంతో బెజ్జూరు-పెంచికల్‌పేట్‌ రహదారి గుండా రాకపోకలు చేయడానికి ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆ మార్గంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయమై రేంజ్‌ అధికారి యాదగిరిని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. పులి సంచరించే ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.

పులిదాడిలో లేగదూడ మృతి

మండలంలోని తలాయి గ్రామంలో రైతు వగాడి గోపాల్‌కు చెందిన లేగదూడ పెద్దపులి దాడిలో మృతి చెందింది. శుక్రవారం మేత కోసం లేగదూడ అటవీ ప్రాంతానికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగిరాలేదు. దీంతో యజమాని అటవీప్రాంతంలో గాలింపు చేపట్టగా.. శనివారం లేగదూడ కళేబరం లభ్యమైంది. ఈ విషయంమై యజమాని అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.

ఇవీ చూడండి: ఆస్తుల ఆన్​లైన్​పై ప్రత్యేక శ్రద్ధ... శరవేగంగా నమోదు ప్రక్రియ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.