కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కైరిగూడ గనుల్లో కురిసిన వర్షానికి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. బెల్లంపల్లి ఏరియా ఓసీపీ- 2 ఉపరితల గనిలో వర్షం కారణంగా 25 వేల 253 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. కోట్లలో నష్టం జరిగినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఏరియా గనుల్లో 11వేల 111 టన్నుల ఉత్పత్తి సాధించాల్సి ఉండగా వర్షాలు అడ్డుగా మారాయి. సింగరేణి జనరల్ మేనేజర్ ఎప్పటికప్పుడు గనులను సందర్శిస్తూ అధికారులకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసి నీటిని బయటకు పంపించే చర్యలు తీసుకోవటంలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఇవీ చూడండి: 'వెంకయ్య, సుష్మల అన్నాచెల్లెల అనుబంధం'