కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం చింతగూడ కోయవాగు పంచాయతీలో మూసివేత దశకు చేరుకున్న ఆ పాఠశాలకు తిరిగి ప్రాణం పోశాడు ఆ ఉపాధ్యాయుడు. ముందుగా పాఠశాల భవనాన్ని బాగు చేశారు. అనంతరం తల్లిదండ్రులను ఒప్పించి... గ్రామస్థుల సహకారంతో పునర్వైభవం తీసుకొచ్చారు. ఆ ఉపాధ్యాయుని సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం... రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ పురస్కారాన్ని పేద విద్యార్థులకే అంకితమిస్తానంటున్న ప్రధానోపాధ్యాయులు కొమ్ము లక్ష్మీ నారాయణతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చూడండి: ఆన్‌లైన్ అగాధంలో చదువులు- గాడిన పడేనా!