ETV Bharat / state

తండ్రి కళ్ళ ముందే జలపాతంలో దూకేశాడు - 10th CLASS STUDENT SUICIDE

ఎదిగిన కొడుకు కళ్ల ముందే కనుమరుగయ్యాడు. దూకేస్తున్నాను నాన్నా... అనే చివరి మాటతో నిర్ఘాంతపోవటమే ఆ తండ్రి వంతైంది. ఈ విషాదకర ఘటన కుమురం భీం జిల్లా... పంగిడిలో జరిగింది.

SON SUICIDE IN FRONT OF HIS FATHER AT KUMURAM BHEEM DISTRICT

author img

By

Published : Feb 28, 2020, 7:18 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం పంగిడిలో విషాదం జరిగింది. జైనూరు మండలం పోచంలోది ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శివదాస్​... తన తండ్రి చూస్తుండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. శివదాస్​కు మూర్ఛవ్యాధితో పాటు మానసిక వైకల్యం ఉంది. కొన్ని రోజులుగా... ఎక్కువసార్లు మూర్ఛ రావటం వల్ల 2 నెలల క్రితం శివదాస్​ను హాస్టల్​ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి నుంచే పాఠశాలకు వెళ్లేవాడు.

ఈ క్రమంలో గురువారం రోజు తండ్రితో కలిసి పొలం పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం పూజ భోజనం చేయడానికి తండ్రి ఇంటికి వెళ్లగా... శివదాసు చేనులోనే ఉండిపోయాడు. సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో తండ్రికి ఫోన్​ చేసి... కుండాయి జలపాతం వద్దకు వెళ్తున్నానని సమాచారమిచ్చాడు. ఐదుగురు గ్రామస్థులతో కలిసి తండ్రి హుటాహుటిన జలపాతం దగ్గరికి వెళ్లాడు. జలపాతం అంచున నిల్చున్న శివదాస్..​ తండ్రి రాకను గమనించాడు. దూకేస్తున్నాను నాన్నా.. అనే చివరి మాటతో జలపాతంలో దూకేశాడు. తన కళ్లెదురుగానే... ఎదిగిన కొడుకు దూకుతున్నా... అచేతనంగా నిలబడిపోవటం ఆ తండ్రి వంతైంది. షాక్​ నుంచి తేరుకున్న ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు.

గ్రామస్థుల సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లతో వెతికించగా... మృతదేహం లభ్యమైంది. విగతజీవిగా మారిన శివదాస్​ను చూసి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

తండ్రి కళ్ళ ముందే జలపాతంలో దూకేశాడు

ఇదీ చూడండి: పరిశోధనల దన్ను లేక ప్రగతి మందగమనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.