కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉపాధి పనుల్లో సామాజిక దూరం పాటిస్తూ ఉపాధి పనులు నిర్వహిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లా వ్యాప్తంగా కూలీలకు 67.36 లక్షల పనిదినాలను కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో పనులు చేపట్టాల్సిన ప్రదేశాలను గుర్తించారు.
పనులు జరుగుతున్న ప్రదేశాల్లో కూలీలకు, అధికారులకు అవసరమైన మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు, నీళ్లు, తగు నీడ అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కూలీలు తప్పనిసరిగా వీటిని వినియోగించి, భౌతిక దూరం పాటించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ ఎఫెక్ట్: వృద్ధురాలికి ఎమ్మెల్యే సాయం