కుమురంభీం జిల్లాలో మొదటి విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. గ్రామాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. జిల్లా సంయుక్త పాలనాధికారి రాంబాబు సిర్పూర్ మండల కేంద్రంలో ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మొదటి విడతలో జిల్లాలోని 6 మండలాలు సిర్పూర్ టి, దహేగాం, కౌటాల, బెజ్జురు, చింతలమానేపల్లి, పెంచికలపేటలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 30 సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి: గరిడేపల్లిలో మండలంలో 'ప్రచారం' గొడవ