ETV Bharat / state

కాగితపు కోటలో.. ఆందోళన బాట! - సిర్పూర్​ కాగితం మిల్లు

సిర్పూర్‌ కాగితం మిల్లు(ఎస్పీఎం) యాజమాన్యం కార్మికులందరిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఎస్పీఎం కార్మికులు ఆందోళన బాట పట్టారు. యాజమాన్యం తీరుకు నిరసనగా వరుస కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఆగస్టు 2న కాగజ్‌నగర్‌లోని రాజీవ్‌గాంధీ చౌరస్తాలో కార్మికులు సామూహిక నిరాహార దీక్షకు నిర్ణయం తీసుకున్నారు. కార్మికులు, వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ నియామకం, పలు నిర్ణయాలు తీసుకున్నట్లు ఆ సంఘం ప్రతినిధి, సీఐటీయూ నాయకుడు అంబాల ఓదెలు తెలిపారు.

Sirpur Paper Mill Workers Call to protest for Re employment
కాగితపు కోటలో.. ఆందోళన బాట!
author img

By

Published : Jul 28, 2020, 11:12 AM IST

కుమురం భీం జిల్లా కాగజ్​ నగర్​లోని సిర్పూర్​ కాగితం మిల్లు యాజమాన్య వైఖరికి దశల వారీగా నిరసన, ఆందోళనలు నిర్వహించేందుకు కార్మికులు కమిటీలు పిలుపునిచ్చారు. ఆగష్టు 2న కాగజ్​ నగర్​లోని రాజీవ్​గాంధీ చౌరస్తాలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు. పలు సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులతో కమిటీలు సైతం ఏర్పాటు చేశారు. ఈ మేరకు సిర్పూర్‌ పేపర్‌ మిల్లు ఎంప్లాయీస్‌ బాధితుల నెగోసేషన్‌ కమిటీని ఎంపిక చేశారు. అందులో సభ్యులుగా సి.వెంకటేష్‌, షబ్బీర్‌ హుస్సేన్‌, డి.శంకరయ్య, వి.వెంకటేశ్వర్లు, సూర్యప్రకాష్‌, ఎస్‌.రాంచందర్‌, సునీల్‌ కుమార్‌, భాస్కర్‌ రెడ్డి, జాన్‌ ప్రకాష్‌ కొనసాగనున్నారు. ఎస్పీఎం హక్కుల పరిరక్షణ కమిటీ, ఆల్‌ పార్టీ ఐకాసను నియమించారు. ఈ కమిటీలో అన్ని పార్టీల నాయకులను సభ్యులుగా నియమించారు.

రెండేళ్లు పూర్తయ్యాయి..

2014 సెప్టెంబరు 27న అప్పటి యాజమాన్యం దీర్ఘకాలిక షట్‌డౌన్‌ పేరిట ఎస్పీఎంను మూసివేసిన విషయం తెలిసిందే. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యూనల్‌(ఎన్‌సీఎల్‌టీ) తీర్పు, రాష్ట్ర ప్రభుత్వం ముడిసరకులపై రాయితీల కల్పనతో జేకే యాజమాన్యం 2018 ఆగస్టు 2న ఎస్పీఎంను తిరిగి ప్రారంభించింది. గతంలో మిల్లులో పని చేసిన స్టాఫ్‌ ఉద్యోగులు, శాశ్వత, కాంట్రాక్టు కార్మికులందరిని దశల వారీగా తిరిగి విధుల్లోకి తీసుకుంటామని యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చింది. మిల్లు ప్రారంభించి రెండేడ్లు పూర్తి కావచ్చినా.. కార్మికులకు ఇచ్చిన హామీ అమలు కాలేదు. నేటికీ దాదాపు 260 మంది శాశ్వత కార్మికులతోపాటు, వందల సంఖ్యలోని ఒప్పంద కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. ఆయా కార్మికులందరినీ తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్​ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 2న పెద్ద ఎత్తున కార్మికులందరూ నిరాహారదీక్ష చేపట్టి, యాజమాన్య వైఖరికి నిరసన తెలుపనున్నారు.

జేకే యాజమాన్యం రెండేండ్ల క్రితం ఎస్పీఎంను ఆధీనంలోకి తీసుకొని పునరుద్ధణ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు 370 మంది స్టాఫ్‌ ఉద్యోగులు, 700 మంది శాశ్వత కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు యాజమాన్యం పేర్కొంటుంది. అయితే ఇంకా దాదాపు 260 మందికిపైనే స్టాఫ్‌, శాశ్వత కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సి ఉందని కార్మికులు వాదిస్తున్నారు.

ఆగస్టు 2 వరకు లేఖలు..

శాశ్వత కార్మికులు, ఒప్పంద కార్మికులందరిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ జులై 28 నుంచి నుంచి ఆగష్టు 2వ తేదీ వరకు ప్రతి కార్మికుడు, ఒప్పంద కార్మికులందరూ వేర్వేరుగా యాజమాన్యానికి దరఖాస్తులు, లేఖలు పోస్టు ద్వారా పంపించనున్నారు.

ఇతర రాష్ట్రాల కార్మికులను విధుల్లోకి..

మిల్లు ఆధునికీకరణ పేరిట మిల్లు యాజమాన్యం వివిధ రాష్ట్రాలకు చెందిన నిపుణులు, గుత్తేదారులు, కార్మికులతో మిల్లు నిర్వహిస్తున్నది. ముందు నుంచి మిల్లులో పనిచేసి.. లాభమైనా, నష్టమైనా మిల్లుతోనే ఉన్న కార్మికులను విస్మరించి ఇతర రాష్ట్రాల వారిని విధుల్లోకి తీసుకోవడం పట్ల కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లోంచి తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లో చేర్చుకోకపోతే.. తీవ్రస్థాయి ఉద్యమం తప్పదని కార్మికులు అంటున్నారు.

ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.