కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద ఏర్పాట్లు సరిగా లేకపోవడం వల్ల ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కరించడం లేదని మండిపడ్డారు.
కాగజ్నగర్ పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వ్యాక్సిన్ కేంద్రాన్ని అదనపు పాలనాధికారి రాజేశం సందర్శించారు. అప్పుడే వచ్చిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలను అదనపు పాలనాధికారి దృష్టికి తీసుకువచ్చారు. విధులకు హాజరు కావాల్సిన మెడికల్ ఆఫీసర్ కేంద్రంలో లేకపోవడం, మెడికల్ సిబ్బంది, అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే ప్రజలకు సరైన ఏర్పాట్లు చేసేంత వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఆలస్యంగా వచ్చిన మెడికల్ ఆఫీసర్ అశ్వినిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి: 'వ్యాక్సిన్ ఉత్పత్తిని రాత్రికి రాత్రే పెంచలేం'