కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంలో వాంకిడి జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు తెరాస కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్ ఎంపీగా నగేష్‌ను గెలిపించి కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలని నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి సర్పంచులు, కాంగ్రెస్ కార్యకర్తలు, తెరాసలోకి వస్తున్నారని స్పష్టం చేశారు . తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ, రెండు పడకల గదుల ఇళ్లు తదితర పథకాలు దేశానికే ఆదర్శమని తెలిపారు.
ఇవీ చూడండి : కేసీఆర్ యాగాలు చేస్తే మోదీకి ఎందుకు భయం