పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కుమురం భీం జిల్లా కాగజ్ నగర్లో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక అంబేద్కర్ చౌక్‌లో చేపట్టిన ఈ కార్యక్రమంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. వెంటనే సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.