కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఈస్గం శివమల్లన్న స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నాలుగు గంటలకు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీసమేతంగా పూజల్లో పాల్గొని శివలింగానికి అభిషేకం చేశారు.
ఆలయాన్ని కమిటీ నిర్వాహకులు విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. . కరోనా నేపథ్యంలో భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆ నదిలో బాణలింగాలు దొరుకుతాయి!