కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని బాలికల సంక్షేమ పాఠశాలలో షీ-బృందాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో షీ-టీం ఇంఛార్జీ ఎస్సై శ్రీలేఖ పాల్గొని విద్యార్థులకు పలు విషయాలను వివరించారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ యంత్రాంగం, షీ-టీం పాటుపడుతుందని తెలిపారు. కళాశాలలో గానీ, ఇతర చోట్ల గానీ... మహిళల పట్ల ఎవరైన ఆకతాయిలు అనుచితంగా ప్రవర్తించిన, వేధింపులకు పాల్పడిన తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. సామాజిక మధ్యమాలలో తమకు సమాచారం ఇచ్చినా... వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవీ చూడండి: తోట రాముడు... ఇంట్లో కేటీఆర్ శ్రమదానం!