కరోనా వైరస్ను కట్టడి చేసే చర్యల్లో భాగంగా కుమురం భీం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాలతో కాగజ్నగర్ పట్టణంలో ఇంటింటి ఫీవర్ సర్వే కొనసాగుతోంది. పట్టణంలోని 30 వార్డుల్లో నలుగురు సభ్యుల బృందం కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
మొదటి విడత సర్వేలో గుర్తించిన లక్షణాలు ఉన్నవారి ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే విషయాలను రెండో విడత సర్వేలో తెలుసుకుంటున్నారు. లక్షణాలు ఉన్నవారు ఎటువంటి చికిత్స పొందాలో సభ్యులు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా పట్టణంలోని ఒకటో నంబర్ వార్డులో రెండో విడత సర్వే నిర్వహించారు. ఈ సర్వేను కమిషనర్ శ్రీనివాస్ పర్యవేక్షించారు.
ఇదీ చూడండి: వైరస్ వ్యాప్తి తగ్గేవరకు జాగ్రత్తగా ఉండాలి: సీపీ అంజనీకుమార్