ETV Bharat / state

నెలరోజుల ఉపవాస దీక్షలు... ఘనంగా బోనాలు - telangana news

నెల రోజుల నుంచి ఉపవాస దీక్షలున్న ప్రజలు... ఆసిఫాబాద్​లోని చల్లమల్లన్నకు మొక్కులు తీర్చుకున్నారు. బోనాలు సమర్పించి.. నైవేద్యాలు అందించారు. అనంతరం అక్కడే భోజనాలు చేస్తూ... కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు.

rush in challa mallanna temple in thumpalli  at asifabad district
నెల రోజుల ఉపవాస దీక్షలు... ఘనంగా బోనాల సంబురాలు
author img

By

Published : Dec 30, 2020, 5:00 PM IST

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం తుంపల్లి గ్రామ సమీపంలోని చల్ల మల్లన్న ఆలయంలో గ్రామ ప్రజలు బోనాలు నిర్వహించారు. నెల రోజుల నుంచి ఉపవాస దీక్షలు నిర్వహించుకుని... నేడు చల్ల మల్లన్నకు మొక్కులు తీర్చుకున్నారు.

ఆలయం వద్ద వంటావార్పులు చేసుకుని... స్వామికి నైవేద్యం సమర్పించారు. మొక్కులు తీర్చుకుంటే... కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి బోనాలను ఘనంగా నిర్వహించారు.

ఇదీ చూడండి: జనవరి నుంచి వచ్చే మార్పులివీ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.