కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు ఉదయం నుంచే అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పలు సంఘాల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. వామపక్ష సంఘాలతో పాటు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉదయం నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పలు సంఘాల నాయకులను, ఆర్టీసీ కార్మికులను 67 మందిని అరెస్టు చేసి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఇవీ చూడండి: స్తంభించిన రాకపోకలు... విపక్షనేతల అరెస్ట్