కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఉపరితల బొగ్గు గనుల్లో నల్లబంగారం ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాలతో గోలేటి, కైరిగూడ, డోర్లి ఉపరితల గనుల్లో నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి ఆటంకంగా మారింది. బెల్లంపల్లి ఏరియాలో 25 వేల 253 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. ఆరు రోజుల నుంచి కురిసిన వానలతో సింగరేణికి కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లింది.
ఇదీ చూడండి: జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం