ETV Bharat / state

kagaznagar FM Station: కాగజ్​నగర్​లో FM కేంద్రాన్ని ప్రారంభించిన మోదీ

author img

By

Published : Apr 28, 2023, 6:58 PM IST

Updated : Apr 28, 2023, 7:07 PM IST

kagaznagar FM Station launched: కాగజ్​నగర్​లో ఉన్న 'లో పవర్​ టీవీ ట్రాన్సీమీటర్'​ కేంద్రం నుంచి సేవలు పునః ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వర్చువల్​గా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలందరూ రేడియో సేవలను సద్వినియోగించుకోవాలని సూచించారు.

fm
fm

kagaznagar FM Station launched: కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లోని తైబానగర్ ఏరియాలో ఉన్న 'లో పవర్ టీవీ ట్రాన్స్​మీటర్' కేంద్రంలో ప్రసార భారతి ఆకాశవాణి ట్రాన్స్​ మీటర్​ (వంద వాట్ల ఎఫ్ఎం) రిలే కేంద్రాన్ని ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఆదిలాబాద్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఇంజినీర్ ఎం.ఎన్.నాయక్ బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, అదనపు పాలనాధికారి చహత్ బాజ్ పాయ్, ఆల్ ఇండియా రేడియో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆదిలాబాద్ నౌసిక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

2002 ఏప్రిల్ 10న అప్పటి ఎంపీ వేణు గోపాలాచారి ఆధ్వర్యంలో కాగజ్​నగర్​లోని తైబానగర్ ఏరియాలో 'లో పవర్ టీవీ ట్రాన్స్​మీటర్'(దూరదర్శన్) కేంద్రాన్ని ప్రారంభించగా.. కొన్నేళ్ల పాటు ఈ కేంద్రం నుంచి సేవలు నిరంతరాయంగా ప్రసారమయ్యాయి. ఆ తరువాత కొన్ని కారణాల వలన 2021 డిసెంబరులో ఈ కేంద్రం నుంచి సేవలను నిలిపివేయబడినట్లు అధికారులు ప్రకటించారు. అప్పటి నుంచి భవనం నిరుపయోగంగానే ఉంది. స్థానిక ప్రజాప్రతినిధుల కృషితో ప్రస్తుతం అందులోనే ఎఫ్ఎం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

Narendra Modi launched Kagaznagar Radio Station: కార్యక్రమంలో భాగంగా ఎంపీ సోయం బాపూరావు మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రసార కార్యక్రమాలు అందించాలనే మంచి ఉద్దేశంతో ప్రధాని మోదీ.. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎఫ్​ఎం కేంద్రాలను ప్రారంభించారని పేర్కొన్నారు. అందులో భాగంగా ఇవాళ కాగజ్​నగర్​లో రేడియో స్టేషన్​ ప్రారంభించారని తెలిపారు. ఈ స్టేషన్​ నుంచి సుమారు 20 కిలో మీటర్ల పరిధి వరకు ప్రసారాలు ఉంటాయన్నారు.

కాగజ్​నగర్​ నుంచి సిర్పూర్​తో పాటు, ఇతర మండలాల పరిధిలోని గ్రామాలకు రేడియో సేవలు అందుతాయని తెలిపారు. ఈ రేడియో ప్రసారాల ద్వారా విద్యార్థులకు ఉపయోగపడే సమాచారంతో పాటుగా వినోదం కలిగించే పాటలు ప్రసారమవుతాయన్నారు. వార్తలతో పాటుగా వాతావరణ సమాచారం, సామాజిక బాధ్యతను పెంచే వివిధ కార్యక్రమాలు ప్రసారం అవుతాయని వాటిని ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు.

"ప్రసార వాణి వలన అనేక లాభాలు ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలు అనేక విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆకాశ వాణి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ఇందులో భాగంగా కాగజ్​నగర్​లో ఎఫ్​ఎం కేంద్రాన్ని తిరిగి ప్రారంభించడం జరిగింది. ఇక్కడ కేంద్రం నుంచి రైతులకు ఉపయోగపడే పథకాలు, ఆధునిక వ్యవసాయ విధానం గురించి తెలుసుకోవచ్చు. యువకులు క్రీడారంగం విశేషాలు, పాటలు, విద్య, ఉద్యోగ సమాచారం, ట్రైన్స్​ సమయం ఇలా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం."- సోయం బాపూరావు, ఎంపీ

ఇవీ చదవండి:

'మన్‌ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ ప్రజల మదిలో నిలిచిపోవాలి'

'చేపను పట్టుకున్నా.. గుడిలోకి వెళ్లొచ్చా?'.. రాహుల్​ డౌట్

తెలంగాణ చరిత్రపుటలో మరో అద్భుత కట్టడం.. నూతన సచివాలయం

'ఆ పనులు.. ఆడవాళ్లు మాత్రమే ఎందుకు చేయాలి?'

Last Updated : Apr 28, 2023, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.