కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణంలోని యాంసాని శ్రీనివాస్ అనే వ్యక్తి కిరాణా దుకాణంలో సోదాలు చేయగా.. సుమారు రూ. 90 వేల విలువ గల నిషేధిత పొగాకు ఉత్పత్తులు లభించినట్లు ఎస్హెచ్వో మోహన్ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: రివ్యూ 2019 : నింగిలో నిరాటంకంగా దూసుకెళ్లిన 'ఇస్రో'