ETV Bharat / state

మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన పోలీసులు - kumurambheem asifabad district news

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో మావోయిస్టులకు నెలవైన మంగీ గ్రామంలో బెల్లంపల్లి లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో పోలీసులు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆదివాసీలకు వైద్య చికిత్సతో పాటు ఉచితంగా మందులు అందజేశారు. సంఘ విద్రోహ శక్తులకు ఎవరూ సహకరించకూడదని జిల్లా ఇన్​ఛార్జి ఎస్పీ సత్యనారాయణ కోరారు.

Police set up a free mega medical camp in kumurambheem asifabad district
ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన పోలీసులు
author img

By

Published : Nov 7, 2020, 12:25 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో మావోయిస్టులకు నెలవైన మంగి గ్రామ పంచాయతీలో 'పోలీసులు మీకోసం' అంటూ బెల్లంపెల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం సీపీ, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్​ఛార్జి ఎస్పీ సత్యనారాయణ హాజరయ్యారు. ఆదివాసీలకు నిత్యావసర సరుకులతో పాటు చలికాలం రగ్గులు, బ్లాంకెట్లు, యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ఆదివాసీలకు సీపీ సత్యనారాయణ వివరించారు. సమాజానికి ఆటంకంగా ఉండే సంఘ విద్రోహ శక్తులకు ఎవరూ సహకరించకూడదని కోరారు. అలా సహకరించినట్లైతే శిక్షార్హులు అవుతారని తెలిపారు.

సంఘవిద్రోహ శక్తుల గురించి పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని ఆదివాసీలకు తెలిపారు. అలా తెలిపిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. బాగా చదువుకు ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. మెగా వైద్య శిబిరంలో భాగంగా వృద్ధులకు, ఆదివాసీలకు వైద్యంతో పాటు కంటి వైద్యాన్ని కూడా అందించి వారికి ఉచితంగా మందులు అందజేసి ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చూడండి: 'ట్రాఫిక్​ నియమాలు పాటించటమే పోలీసులకు మనమిచ్చే గౌరవం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.