కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం లంజన్ వీర ఏజెన్సీలో మహారాష్ట్రకు చెందిన ఆరు లంబాడీ కుటుంబాలు ప్రభుత్వ భూమిలో ఇళ్లు నిర్మించుకుని కొన్ని రోజులుగా ఉంటున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా ఆదివాసీలు ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలంటూ ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు బందోబస్తు నడుమ.. లంబాడీల కుటుంబాల ఇళ్లను తొలగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పిప్పర్ గొంది, నవేదరి గ్రామాల్లో పోలీసులు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా అదనపు ఎస్పీ సుధీంద్ర బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఇదీ చూడండి : మేయర్ పీఠం దక్కకున్నా.. అభివృద్ధికి కృషి చేస్తాం: బండి