ETV Bharat / state

మావోయిస్టుల జాడ.. అడవంతా జల్లెడ

ప్రాణహిత దాటి కుమురం భీం జిల్లాలోకి ప్రవేశించిన మావోయిస్టులు గత ఇరవై రోజుల నుంచి ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలోనే సంచరిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అడవులను జల్లెడ పట్టడానికి గ్రేహౌండ్స్‌, స్పెషల్‌ పార్టీ పోలీసులు ముమ్మరంగా కూంబింగ్‌ నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌ నుంచి 90 వరకు గ్రేహౌండ్స్‌ దళాలు ఉమ్మడి జిల్లాకు వచ్చివెళ్లాయి. మావోయిస్టు నేతలు ఇన్ని రోజులుగా ఉమ్మడి జిల్లాలో కదలికలను కొనసాగించడం పట్ల పోలీసులు అప్రమత్తమవుతున్నారు.

police combing for Maoists in adilabad and asifabad districts
మావోయిస్టుల జాడ.. అడవంతా జల్లెడ
author img

By

Published : May 10, 2020, 8:16 AM IST

కుమురం భీం జిల్లా దహెగాం మండల సమీపంలో ప్రాణహిత పక్కనున్న మొట్లగూడ నుంచి గత నెల 15, 16వ తేదీల మధ్య వర్గీస్‌ దళం జిల్లాలోకి ప్రవేశించిందని పోలీసులు గుర్తించారు. తిర్యాణి మండలంలోని మంగీ, గోవెన, కౌటన్‌మోవాడ్‌ గ్రామాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు ఏఎస్పీ సుధీంద్ర ఇతర పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ఐదు రోజుల అనంతరం వీరికి మావోయిస్టు రాష్ట్ర కమిటీలో కీలకంగా పని చేసే భాస్కర్‌ జత కలిశారని పోలీసులకు సమాచారం అందింది. మొత్తం 12 మంది మావోయిస్టులు తిర్యాణి మండలం నుంచి నిర్మల్‌ జిల్లా కడెం మండలం అటవీ ప్రాంతం నుంచి ఇంద్రవెల్లి మండలం వాయుపేట్‌ అడవుల్లోకి ప్రవేశించారని పోలీసులకు నిఘా వర్గాలు సమాచారం అందించాయి.

గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోకి వస్తే సమాచారం అందించాలని చెబుతున్న బెజ్జూర్‌ ఎస్‌ఐ సాగర్‌

ఆదిలాబాద్‌ జిల్లాలో...

ఇంద్రవెల్లి నుంచి మావోయిస్టులు సిరికొండ, నేరడిగొండ మండలాల్లోని కుప్టి, కుమారి మీదుగా మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న అజ్జర్‌వజ్జర్‌ గ్రామ అడవుల్లో ఉన్నారని సమాచారం మేరకు గాలింపులు చేపట్టారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల నుంచి గ్రేహౌండ్స్‌ దళాలు ఆరు, స్పెషల్‌ పార్టీ పోలీసులు 185 మంది అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఒక్కో గ్రేహౌండ్స్‌ దళంలో ఇరవై మంది చొప్పున 120 మంది పోలీసులు ఉంటారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు మావోయిస్టుల విషయంలో తీవ్రంగా దృష్టి సారించారని జిల్లా పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇద్దరి నేతలకు ఉమ్మడి జిల్లాపై పట్టు..

మంగీ దళంలో కుమురం భీం జిల్లా నుంచి కీలకంగా ఉండే శోభన్‌ 2016 మహారాష్ట్రలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. శోభన్‌కు ముఖ్య అనుచరుడిగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వర్గీస్‌ మావోయిస్టు దళంలో పని చేసే సమయంలో ఉమ్మడి జిల్లాకు వచ్చేవారు. వర్గీస్‌కు సైతం జిల్లా అడవులు, గ్రామాల గురించి పూర్తిగా అవగాహన ఉంది. మరోవైపు బోథ్‌ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన భాస్కర్‌ 25 సంవత్సరాల నుంచి దళంలో పని చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర మావోయిస్టు దళంలో సభ్యునిగా ఉన్నారు. ప్రస్తుతం భాస్కర్‌, వర్గీస్‌ ఉన్నారని వీరు దళ సభ్యులతో బోథ్‌ మండలంలోని గ్రామాల్లో సంచరిస్తున్నారని పోలీసులు అంటున్నారు.

రిక్రూట్‌మెంట్‌ కోసమా? అనారోగ్య కారణాలా?

ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు చెందిన మావోయిస్టులు అంతా ఛత్తీస్‌గఢ్‌ ఇతర రాష్ట్రాల దళాల్లో పనిచేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు, అక్కడి మావోయిస్టు నేతలతో వచ్చిన విభేదాల కారణం, మనవాళ్లతో మనమే దళాన్ని తయారు చేద్దామనే ఆలోచనతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో వర్గీస్‌, భాస్కర్‌లు కొత్త సభ్యులను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మరోవైపు అనారోగ్య కారణాలు సైతం వెంటాడుతున్నాయా, సుదీర్ఘ లాక్‌డౌన్‌ కొనసాగడంతో మావోయిస్టులు ఇక్కడే ఉంటున్నారా అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

అప్రమత్తంగా ఉన్నాం

మావోయిస్టు కదలికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పోలీసులం అప్రమత్తంగా ఉన్నాం. అందిన సమాచారం మేరకు నిర్దేశిత ప్రాంతాల్లో ప్రత్యేక దళాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశాం.

- సుధీంద్ర, ఏఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.