ETV Bharat / state

Police chasing: పశువుల అక్రమ రవాణా.. సినిమా తరహాలో పోలీసుల ఛేజింగ్..!

అతివేగంగా వెళ్తున్న నేరస్థుల వాహనాన్ని పట్టుకోవడానికి పోలీసులు ఛేజింగ్(Police chasing) చేసే ఘటనలు సినిమాల్లో చూస్తుంటాం.. అచ్చం ఇలాంటి సంఘటనే కుమురం భీం జిల్లా కాగజ్ నగర్​లో బుధవారం అర్ధరాత్రి జరిగింది. డీసీఎం వ్యాన్​ను వెంబడిస్తూ వచ్చిన మహారాష్ట్ర పోలీసుల జీపు ప్రమాదవశాత్తు కాగజ్ నగర్​ రహదారి డివైడర్​పై ఇరుక్కుపోయింది.

Police chasing, Cattle transport illegally
పశువుల అక్రమ రవాణా, సినిమా తరహాలో పోలీసుల ఛేజింగ్
author img

By

Published : Nov 19, 2021, 11:47 AM IST

అతివేగంగా వస్తున్న ఓ వ్యాన్​ను పట్టుకునేందుకు మహారాష్ట్ర పోలీసులు ముమ్మర ప్రయత్నం చేశారు. సినిమా తరహాలో ఛేజింగ్(Police chasing) చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు డీసీఎంలో దాదాపు 20 నుంచి 30 పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు మహారాష్ట్ర లాటీ పోలీసు అధికారులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... సోనాపూర్ గ్రామస్థులకు సమాచారం అందించారు. పలువురు స్థానిక యువకులు ఆ రహదారిపై ఎడ్లబండ్లు, డ్రమ్ములను ఏర్పాటు చేసి... వ్యాన్ నిలుపుదలకు యత్నించారు. కానీ ఆ వ్యాన్ డ్రైవర్ ఆపకుండానే రోడ్డుకు అడ్డంగా వేసిన ఎడ్లబండ్లను, డ్రమ్ములను ఢీకొని కాగజ్ నగర్ వైపు అతివేగంతో దూసుకెళ్లారు.

వంతెనపై ఇరుక్కుపోయిన జీపు

ఆ వ్యానును అడ్డుకునేందుకు లాటీ పోలీసులు జీపు, గ్రామస్థులు కారుతో వెంబడించారు. ఆ వ్యాన్ కాగజ్ నగర్ రైల్వే పైవంతెన నుంచి అతివేగంగా పోతుండగా పట్టణవాసులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో పోలీసుల జీపు ప్రమాదవశాత్తు కాగజ్ నగర్ రైల్వే పైవంతెన సమీపంలోని రహదారి డివైడర్ల మధ్యలోకి ఇరుక్కుపోయి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాగజ్ నగర్ టౌన్ పీఎస్ఐ తేజశ్విని ఘటన స్థలాన్ని సందర్శించి... మహారాష్ట్ర పోలీసులతో వివరాలను సేకరించారు. రెబ్బెన, ఆసిఫాబాద్, మంచిర్యాల పోలీసులకు ఆ వ్యాన్ విషయమై సమాచారం అందించినప్పటికీ ఆచూకీ లభించలేదు.

స్థానికుల సహకారంపై అనుమానాలు

పోలీసులు ఇంత ప్రమాదకరంగా ఛేజింగ్ చేసినా... వ్యాన్ చిక్కకుండా పారిపోవడానికి సహకారం అందించారని అనుమానితులైన స్థానిక ఇద్దరు వ్యక్తుల చరవాణిలను సైతం లాటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్​ను సంప్రదించగా.. లాటీ పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఇటీవలే సిర్పూర్(టి) ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనే జరిగినట్లు తెలుస్తోంది. పశువుల రవాణాలో స్థానికంగా పలువురి హస్తమున్నట్లు తెలుస్తోంది. పశువులను అక్రమంగా రవాణా చేసే ముఠా సభ్యులకు స్థానికులు సహకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సదరు వ్యక్తులు తెలిసినప్పటికీ సంబంధిత అధికారులు చూడనట్లుగానే వదిలేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: suicide: ప్రేమ పెళ్లి చేసుకున్న 20 రోజులకే నవ వధువు మృతి... అసలు ఏమైంది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.