ETV Bharat / state

ఐపీఎల్​ బెట్టింగ్​లతో యువత చిత్తు..చిత్తు..

ఐపీఎల్ మొదలైన నాటి నుంచి యువత చరవాణిలో బిజీగా ఉంటున్నారు కదా! అందరూ మ్యాచులు, స్కోర్ చూస్తున్నారని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. చాలామంది డ్రీమ్ 11 అనే యాప్​లో బెట్టింగ్​లకు పాల్పడుతూ.. డబ్బులు వృధా చేసుకుంటున్నారు. వారు ప్రకటించే ప్రైజ్ మనీకి ఆకర్షితులై ఇందులో పాల్గొంటున్నారు. పాల్గొనేది లక్షలమంది, ప్రైజ్ మనీ ఇచ్చేది పదుల సంఖ్యలో ఉంటుంది. అప్పులు చేసి మరీ బెట్టింగ్​లకు దిగుతున్నారు. ఆన్లైన్లో ఉంటూ తమ విలువైన సమయంతో పాటు డబ్బులు వృధా చేసుకుంటున్నారు.

online bettings on ipl in asifabad
ఐపీఎల్​ బెట్టింగ్​లతో యువత చిత్తు..చిత్తు..
author img

By

Published : Oct 5, 2020, 12:56 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఐపీఎల్​పై యువత ఆన్లైన్ బెట్టింగుల ద్వారా జేబుకు చిల్లు పెట్టుకుంటున్నారు. యువతకు వ్యసనం లాగా మారి ఇబ్బందుల్లో పడుతున్నారు. ప్రైజ్ మనీ మోజులో యువత తప్పుదారులు తొక్కుతున్నారు.

నిషేధించారు కదా..

ఇటీవలే తెలంగాణ, ఏపీలలో జూదానికి సంబంధించి ఆన్లైన్ రమ్మీ, పోకర్, తీన్ పత్తి వంటి ఆటలను ప్రభుత్వం నిలిపి వేసిన సంగతి తెలిసిందే. డ్రీం 11 యాప్​ను నిషేధించినప్పటికీ.. ఇతర రాష్ట్రాల పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ కాంటెస్ట్​లో పాల్గొంటున్నారు. 30 రూపాయల నుంచి 10,000 చెల్లించి ఈ బెట్టింగ్​లకు పాల్పడుతున్నారు.

కాంటెస్ట్ విధానం ఇలా..

మ్యాచ్ జరిగే రోజు రెండు జట్ల నుంచి 11 మంది క్రికెటర్లను ఎంచుకొని ఒక టీమ్​ను ఎంపిక చేసుకుంటారు. ఇందులో ఉన్న సభ్యుల ఆటను బట్టి యాప్ పాయింట్లు ప్రకటిస్తుంది. ఎంచుకున్న టీము సభ్యులు అందరూ బాగా ఆడి ఎక్కువ పాయింట్లు సంపాదిస్తే కాంటెస్టులో మొదటి స్థానంలో కొనసాగుతారు. 20 కోట్ల రూపాయలు కాంటెస్టులో మొదటి స్థానంలో నిలిచిన వారికి ఒక కోటి ప్రైజ్ మనీ ఇస్తారు. ఈ కాంటెస్టులో 54 లక్షల పైగా మంది 49 రూపాయలు చెల్లించి పాల్గొంటారు. ఇంతమందిలో మొదటి స్థానంలో నిలిచిన ఒక్కరికి మాత్రమే కోటి రూపాయలు వస్తాయి. తరువాత 10 స్థానాల వరకు 5 లక్షల నుంచి పదివేల వరకు ఇస్తారు. తరువాత 30 లక్షల మంది వరకు వరుసలో ఉన్న వారికి వారి డబ్బులు వారికి తిరిగి ఇస్తారు. ఆ తరువాత దిగువ ఉన్న పది లక్షల మంది తమ డబ్బులు కోల్పోవాల్సిందే.

తల్లిదండ్రులే గుర్తించాలి..

ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. విద్యార్థులు, యువకులను తల్లిదండ్రులే గమనిస్తూ ఉండాలి. స్నేహితులతో కలిసి మ్యాచ్ చూస్తామంటూ వెళ్లే వారు బయట బెట్టింగ్​లలో కూడా పాల్గొంటున్నారు. తల్లిదండ్రుల ఫోన్లలో ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్లైన్ చెల్లింపులు జరిపే యూపీఐ ఐడిని తెలుపక పోవడమే మంచిది.

ఇదీ చూడండి:నిన్న నిర్భయ.. నేడు హాథ్రస్.. కేసేదైనా పోరాటం సీమదే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.