ఆసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతున్న కరోనా సర్వే - ఆసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతున్న కరోనా సర్వే
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో కరోనా సర్వే కొనసాగుతోంది. అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు సంయుక్తంగా పాల్గొని ప్రజల వివరాలను తెలుసుకుంటున్నారు.
![ఆసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతున్న కరోనా సర్వే ongoing-corona-survey-of-komuram-bhim-asifabad-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6857779-505-6857779-1587316737736.jpg?imwidth=3840)
ఆసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతున్న కరోనా సర్వే
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి సర్వే చురుగ్గా కొనసాగుతోంది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల సంఖ్య, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలను అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు, ఇతర శాఖల సిబ్బంది సంయుక్తంగా సేకరించారు. అనుమానితులను ధర్మల్ స్క్రీనింగ్ ద్వారా ఉష్ణోగ్రతలను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని అదనపు జిల్లా వైద్య అధికారి సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.