దిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి నుంచి మరొకరికి కరోనా వైరస్ వ్యాపించింది. జిల్లాలోని జైనూరు మండల కేంద్రానికి చెందిన ముగ్గురు దిల్లీ వెళ్లి రాగా వారిలో ఒకరికి కరోనా సోకింది. అతని ఇద్దరు కుమారులకు వ్యాధి సోకినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న మరో 13 మందిని ఆసిఫాబాద్ ఐసోలేషన్ వార్డుకు తరలించి, వారి నమూనాలను గాంధీ ఆసుపత్రికి పంపారు.
అందులో ఒకరికి కరోనా సోకినట్లుగా గురువారం రాత్రి నివేదిక వచ్చింది. అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక వాహనం సమకూర్చి పాజిటివ్ వచ్చిన వ్యక్తిని హైదరాబాద్ గాంధీకి తరలించారు. రెడ్‌జోన్‌గా ప్రకటించిన జైనూర్‌లో మరో కేసు నమోదు కావడం వల్ల మొత్తంగా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య 4కు చేరుకుంది.
ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!