ETV Bharat / state

'చివరి మజిలీలో ఉన్న పెద్దలకు సేవ చేయడం పిల్లల భాగ్యం'

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గోలేటి గ్రామంలో జిల్లా పాలనాధికారి సూచన మేరకు సింగరేణి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేశారు. అక్టోబర్​1 ప్రపంచ వయో వృద్ధ దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం సక్కు దానిని ప్రారంభించారు.

old age home opened by mla athram sakku at goleti village in kumurambheem district
'చివరి మజిలీలో ఉన్న పెద్దలకు సేవ చేయడం పిల్లల భాగ్యం'
author img

By

Published : Oct 1, 2020, 3:09 PM IST

కుమురంభీం జిల్లా రెబ్బెన మండలం గోలేటి టౌన్​షిప్​లో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధాశ్రమాన్ని జెడ్పీ ఛైర్​పర్సన్ కోవలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రారంభించారు. మనల్ని కనిపెంచి పెద్దచేసి ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులను అనాథశరణాలయాలు, వృద్ధాశ్రమాల్లో చేర్పించడం బాధాకరమని ఎమ్మెల్యే తెలిపారు.

చివరి మజిలీలో ఉన్నపెద్దలకు పిల్లలే సేవ చేసి కన్న రుణాన్ని కొంత వరకైనా తీర్చుకోవాలని నేటి యువతకు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా జిఎం కొండయ్య, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, తదితర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.