కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జెండాగూడా గ్రామ సమీపాన స్టార్ ఆయిల్ ఇండస్ట్రీస్ మిల్లులో ప్రజా పంపిణీ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో ఆయిల్ మిల్లుకు వెళ్లి తనిఖీ చేయగా... అక్రమంగా నిల్వ ఉంచిన 80 క్వింటాళ్ల ప్రజాపంపిణీ బియ్యాన్ని గుర్తించారు. దొంగతనంగా సరఫరా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. గతంలోనూ ఇదే మిల్లులో రెండు మూడు సార్లు బియ్యం దొరికినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చూడండి: పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం