సమత హత్యాచారం కేసులో విచారణను ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు రేపటికి వాయిదా వేసింది. నిందితుల తరఫున సాక్ష్యం చెప్పడానికి రెండోరోజు కూడా సాక్షులు ముందుకురాలేదు. సాక్ష్యం చెప్పేందుకు గడువు ముగిసినట్లు కోర్టు తెలిపింది.
రేపట్నుంచి ఇరుపక్షాల వాదనలు ప్రారంభంకానున్నాయి. కోర్టులో విచారణ అనంతరం నిందితులను జిల్లా జైలుకు తరలించారు.