కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఉదయం 10 గంటల వరకు విపరీతమైన రద్దీ నెలకొంది. ఆదివారం కావడం వల్ల జనాలు పెద్ద ఎత్తున మాంసం కోసం మార్కెట్కు ఎగబడ్డారు. మార్కెట్ నిర్వహణ సమయం తక్కువగా ఉన్నప్పటికీ... మండలంలోని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో సంతకు తరలివచ్చారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పటికీ... ఏ ఒక్కరు కూడా మాస్కు, భౌతిక దూరం పాటించకుండానే తమకు కావాల్సిన నిత్యావసర సరుకుల కొనుగోలు చేస్తున్నారు.
రాజీవ్ గాంధీ కూడలి, అంబేడ్కర్ కూడలి, పొట్టి శ్రీరాములు కూడలిలో వాహనాల రద్దీ ఎక్కువైంది. జనాలు కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున పోలీసులు రంగంలోకి దిగి వాహనాల రద్దీని నియంత్రించారు. 10 గంటల తరువాత ఎవరూ బయట తిరగరాదని, నిబంధనలు ఉల్లంగిస్తే వాహనాలు జప్తు చేస్తామని హెచ్చరించారు.
ఇదీచదవండి : మాంసం దుకాణాల వద్ద బారులుతీరిన జనం.. కనిపించని భౌతికదూరం