నులిపురుగులు కలిగి ఉన్న పిల్లలు అనేక రకమైన ఆరోగ్య సమస్యలతో బాధపడతారని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా డిప్యూటీ డీఎం సుధాకర్ నాయక్ అన్నారు. రక్తహీనత, పోషకాహారలోపం, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, బరువు తగ్గడం, బలహీనత వంటి లక్షణాలతో పిల్లలు బాధపడుతుంటారని తెలిపారు.
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా... కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీసరస్వతి శిశు మందిర్ పాఠశాలలో నులిపురుగుల నివారణ మాత్రలను(ఆల్బెండజోల్) విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎంతో పాటు డాక్టర్ సత్యనారాయణ, ఎంపీపీ అరిగెల మల్లికార్జున యాదవ్ పాల్గొన్నారు.
- ఇదీ చూడండి: తెలుగు ప్రజల అండతో ఇదంతా చేశాం:ఈనాడు ఎండీ కిరణ్