బాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలని జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యలు హాజీ ఆనంద్ ప్రజ్ఞా పరందే అన్నారు. కుమురం భీం జిల్లా ఉట్నూర్లో నిర్వహించిన బాలల హక్కుల అవగాహన సదస్సులో జిల్లా పాలనాధికారి దివ్యాదేవరాన్తో కలిసి పాల్గొన్నారు. స్థానికులు గుస్సాడీ నృత్యంతో అధికారులకు స్వాగతం పలికారు. గిరిజన చిన్నారులు రక్తహీనత బారిన పడకుండా అందిస్తున్న పౌష్ఠికాహారం వివరాలు ఐసీడీఎస్ అధికారులు వివరించారు. అనంతరం ఉట్నూర్ మండల కేంద్రంలో అంగన్వాడీ మోడల్ ప్లే స్కూల్ ప్రారంభించారు. బాలల హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రచార రథానికి శ్రీకారం చుట్టారు.
ఇదీ చూడండి: అరబ్షేక్ చెర నుంచి బయటపడ్డ వీరయ్య