సర్ప పూజకు శ్రావణశుద్ధ పంచమిని ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. అందుకే శుక్లపక్షంలో వచ్చే పంచమిని నాగపంచమిగా జరుపుకుంటున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మహిళలు తమ కుటుంబాలను నాగదేవత సంరక్షించాలని పుట్టలో పాలుపోసి పూజించారు. దేవతామూర్తుల దర్శనానికి వచ్చిన భక్తులతో జిల్లాలోని ఆలయాలు కిక్కిరిసిపోయాయి. కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండిః రాష్ట్రంలో ర్యాలీలు, ఊరేగింపులు నిషేధం