కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో పురపాలిక ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. వాతావరణాన్ని పట్టించుకోకుండా ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చారు.
సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, రమాదేవి దంపతులు ఒకటో వార్డులోని ఒకటో పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'