కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పలు దుకాణాలకు జరిమానా విధించారు పురపాలక అధికారులు. లాక్డౌన్ సమయంలో సాధారణ కార్యకలాపాల నిర్వహణకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వెసులుబాటు ఇవ్వగా... అల్పాహార కేంద్రాలు హోటళ్లు నిర్వహిస్తున్నారు.
పట్టణంలోని వెల్ కం అల్పాహార కేంద్రం వద్ద భౌతిక దూరం పాటించకపోవడం వల్ల పురపాలక కమిషనర్ శ్రీనివాస్ 500 రూపాయలు జరిమానా విధించారు. కరోనా వైరస్ను అరికట్టాలంటే ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ చదవండి: అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు