కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎంపీ సోయం బాబూరావు పర్యటించారు. రెబ్బెన మండలం రోళ్లపాడు, కొత్తగూడ గ్రామాల్లో నిరుపేదలకు నిత్యావసర సరకులు అందజేశారు. ప్రస్తుతం కరోనా కట్టడికి లాక్‌డౌన్ ఒక్కటే సరైన మార్గామని... అందరూ సమష్టిగా కృషి చేయాలని అన్నారు. కరోనా వైరస్ నివారణకు ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. లాక్‌డౌన్‌తో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు.
ఇదీ చూడండి: సుజల దృశ్యం.. సీఎం కేసీఆర్‌తో సాక్షాత్కారం: కేటీఆర్