కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో రైతుల వద్ద మిగిలి ఉన్న పత్తి నిల్వలను సీసీఐ ద్వారానే కొనుగోలు చేస్తారని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. లాక్డౌన్ మొదలయ్యేటప్పటికి రైతుల వద్ద 30 శాతం పత్తి నిల్వలు ఉండిపోయాయని అన్నారు. గత నెల 26 నుంచి మిగిలి ఉన్న పత్తి నిల్వల విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, స్పందించిన అధికారులు సీసీఐ ద్వారా కొనుగోలు చేసేందురు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
రైతుల వద్దకే వ్యవసాయ శాఖ అధికారులు, సీసీఐ అధికారులు, మార్కెట్ కమిటీ అధికారులు వచ్చి పత్తి నాణ్యతను పరిశీలించి టోకెన్లు ఇస్తారని, ఆ టోకెన్ల ప్రకారం కౌటల మండలం, క్రాస్ రోడ్డులోని జిన్నింగ్ మిల్లుకు వెళ్లి పత్తిని విక్రయించాలని రైతులకు తెలియజేశారు. అవగాహన లేకుండా చెప్పేవారి మాటలు విని రైతులు మోసపోవద్దని కోరారు. నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పత్తి నిల్వలు అయిపోయేంత వరకు సీసీఐ ద్వారానే పత్తి కొనుగోళ్లు జరుగుతాయని తెలిపారు.
ఇవీ చూడండి:ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్