ETV Bharat / state

నిరుపేదల ఆకలి తీరుస్తోన్న ఎమ్మెల్యే.. నిత్యం వెయ్యి మందికి అన్నదానం.. - MLA koneru konappa

ఆకలికి అన్నం.. దాహానికి నీరు.. బతుకు దెరువులో ఉపశమం కలిగించే అంశాలివి. సహజంగానైతే ఏ ఆశ్రమాల్లోనో.. దేవాదాయ సత్రాల్లోనో నిత్యన్నదానం జరుగుతుంటుంది. భక్తులకు ఆకలి తీరుతుంది. కానీ ఓ శాసనసభ్యుడిగా కోనేరు కోనప్ప నిర్వహిస్తున్న నిత్యన్నదానం సామాన్య ప్రజల ఆకలి తీరుస్తోంది. నిరుపేదల క్షుద్భాద తొలుగుతోంది.

MLA koneru konappa serving people with daily meals for free in kagajnagar

author img

By

Published : Apr 27, 2022, 5:35 AM IST

నిరుపేదల ఆకలి తీరుస్తోన్న ఎమ్మెల్యే.. నిత్యం వెయ్యి మందికి అన్నదానం..

రాజకీయమంటేనే .. క్షణం తీరికలేకుండా సాగే ఓ వ్యాపకం లాంటిది. పైగా... ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత... నేతల దినచర్య మరింత బిజీగా మారిపోతోంది. కానీ దానికి భిన్నంగా కోనేరు కోనప్ప చేస్తున్న ప్రయత్నం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. కరోనా కంటే ముందు.. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ కేంద్రంగా ప్రతిరోజు మధ్యాహ్నం పేదలకు అంబలి పోశారు. ప్రభుత్వ ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేశారు. తాజాగా కాగజ్‌నగర్‌ కేంద్రంగా రోజుకు వెయ్యిమందికి తగ్గకుండా... నిత్యన్నదానం చేస్తున్నారు. కేంద్రంలో అడుగుపెట్టగానే వేంకటేశ్వర సుప్రభాతం, భక్తిగీతాలు స్వాగతం పలుకుతాయి. అక్కడ ఉన్నంతసేపు.. ఏదో భక్తికేంద్రంలో ఉన్నామనే తృప్తి కలుగుతోంది.

కాగజ్‌నగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌కు ఎదురుగా నిత్యన్నదానం సత్రం కొనసాగుతోంది. స్వయంగా ఎమ్మేల్యే సతీమణి రమాదేవి నేతృత్వంలో ప్రతి రోజు ఉదయం 8గంటలకే వంటల తయారుచేసే కార్యక్రమం ప్రారంభమవుతోంది. రోజుకు వెయ్యిమందికి తగ్గకుండా మధ్యాహ్నం భోజనం పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. కాగజ్‌నగర్‌, దహేగాం, సిర్పూర్‌(టి), బెజ్జూరు, పెంచికల్‌పేట, కౌటాల మండలాల నుంచి.. వివిధ పనులపై కాగజ్‌నగర్‌ వచ్చే సామాన్యులకు .. కోనప్ప పెడుతున్న మధ్యాహ్న భోజనం ఆకలిని తీరుస్తోంది.

రోజువారీ భోజనానికి అంతరాయం ఏర్పడకుండా నెలరోజులకు అవసరమైన సరకులన్నీ ముందుగానే అన్నదాన సత్రంలో.. నిల్వ ఉంచడం ఇక్కడి ప్రత్యేకత. భోజనానికి వచ్చేవారు క్యూ పద్ధతి పాటించాల్సి ఉంటుంది. రోజుకు 20 మంది పనిచేస్తుంటారు. భోజనం చేసిన తర్వాత పల్లెం, గ్లాస్‌ను నిర్వహకులే వేడినీళ్లలో కడిగేస్తారు. ఎక్కడా అపరిశుభ్రతకు, అసౌకర్యానికి తావుండదు. ఓ కార్మికునిగా కాగజ్‌నగర్‌కు వచ్చిన తనను.. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన సిర్పూర్‌ నియోజకవర్గ ప్రజలకు భోజనం పెట్టడడం ఓ అదృష్టమని కోనప్ప తెలిపారు. కోనప్ప చేస్తున్న పనిలో.. ఆయన సతీమణి రమాదేవీ పాత్ర ఉంది. అన్నదాన సత్రాన్ని అన్నీ తానై ఆమె నడిపిస్తోంది.

పండుగలు, ఆదివారాలు మినహాయిస్తే మిగిలిన అన్నీ రోజుల్లో అన్నదానం జరుగుతోంది. సొంత డబ్బులతోనే సరకులు కొనుగోళ్లు చేస్తున్న కోనప్ప.. నిత్యాన్నదాన విజయవంతంగా కొనసాగుతోంది. దాంతోపాటు పెళ్లిళ్లు, పుట్టిన రోజులతోపాటు దైవకార్యంగా భావించి మానవతావాదులు సైతం... ఇతోదికం సాయం చేయడానికి ముందుకురావడం కలిసివస్తోంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.